"ధృక్ సిద్దాంతం & పూర్వసిద్దాంతం"
మన పంచాంగములు సౌరమాన-చామంద్రమాన సిద్దాంతల మేలికలియకతొ కూర్చబడి హిందు సాంప్రదాయ జీవన విదానానికి అనుగుణంగ ఎన్నోవిధములుగ ఉపకరిస్తున్నది.
ఏ ఒక్క సిధాంతంపైనే మనపంచాంగం నిర్మించబడదు,మనకు ఉపయోగపడదు.ధృక్ (సాయన,పాశ్చత్యులపద్దతి)
-ఫూర్వ సిద్ధాంతం (నిరయణ,మన సాంప్రదాయ సిధాంతం) సౌరమాన-చాంద్రమన పద్దతులు,ఈ రెండిటిని వేరుచేయలేము.
"చిత్ర పక్ష అయనాంశ"
సాయన పద్దతిలొ అయనాంశకు ఎంతప్రాధాన్యత ఉందో, నిరయణ సిద్దాంతలో కుడా అయనాంశకు అంతే ప్రాధాన్యత ,కాని నేడు ఎన్నో అయనాంశలు ఆచరణలొ ఉన్నాయి.
ఏది సత్యమో నిరూపించేది గ్రహాణాలే ప్రత్యక్ష నిదర్శనాలు. గ్రహణాద్యయములో గ్రహణ మద్యకాలము తిథి అంత్యకాలము ఇంచుమించుగా సరిపొవాలనే సూత్రంమున్నది.
గ్రహణమందు పౌర్ణమికి పట్టు - పాడ్యమికి విడుపు అన్నారు మన పెద్దలు. అమవాస్యకు సూర్యగ్రహణం - పౌర్ణమిలో చంద్రగ్రహణం ప్రాప్తించును.
సూర్యగ్రహణం తీక్షణంగా చుడలేము కావున, చంద్రగ్రహణం స్పష్టంగా చూడవచ్చును.కావున ఈ వాక్యమును చెప్పిఉండవచ్చు.
**పౌర్ణమి పట్టు అనగా గ్రహణ ప్రారంభ కాలము నుండి గ్రహణమద్యకాలము వరకు అని అర్థం.
దీనిని బట్టి గ్రహణ మద్యకాలము పౌర్ణమితిథి అంత్యము ఒకటే అని అర్థమగుచున్నది.
**పాడ్యమి విడుపు అనగా గ్రహణ మద్యకాలము నుండి గ్రహణ అంత్యకాలము వరకు అని అర్థం
సూర్య గ్రహణ ఆద్యంత పట్టు-విడుపు మొత్తము కాలములో అమావస్య-పాడ్యమి తిథులు అర్థభాగంగ వుంటాయి.
**చంద్రగ్రహణం ఆద్యంత పట్టు-విడుపు మొత్తము కాలములో అర్ధబాగలుగ పౌర్ణమి-పాడ్యమి తిథులు ఉంటాయి.
ఈ సూత్రమునకు పత్యక్షంగా సరిపోయేది N.C.LAHARI.ప్రతిపాదించిన చిత్ర పక్ష అయనాంశ మాత్రమె దృక్ కు వచ్చుచున్నది.
కావున ఈ సిధ్దాంతమును దృక్ సిద్ధాంతము అని వ్యవహరింతురు.
*** ఉభయ సాయన-నిరయణ పద్దతులలో ఎ పద్దతి ద్వారా తిద్ద్యాంతాన్ని సాధించినను శుద్ద పాడ్యమి మొదలు బహుళ అమావాస్యాంత కాలములు ఒకటిగానే వచ్చితీరును. వచ్చితిరాలి.
ఈ కారాణలవల్లే పాశ్చాత్యుల సాయన పంచాంగ రీత్యా సాధించిన తిధ్యాంతకాలాని కే సమానంగా
**1.N.C.LAHARI,
**2.B.V.RAMAN,
**3.K.P. గార్ల అయనాంశలరీత్యా సాధించిన తిద్ద్యాంతాలు సమానంగా ప్రాప్తించు చున్నవి.
** సంపూర్ణ చంద్రగ్రహణ మద్యకాలము ఎవరి అయనాంశములను తీసుకొని సాధించినా ప్రాప్తించు పౌర్ణమి తిధ్యాంత కాలమునకు సమానముగా కాని,
సమీపముగకాని యుండునో వారు సాధించిన అయనాంశముల రీత్యా గణింపబడిన పంచాంగమే దృక్సిద్దాంతమైనదని ఋజువగుచున్నది.
** అలాగే అమవాస్యనాడు సూర్యగ్రహణ మధ్యకాలముతొ అమావాస్య అంత్యకాలాలుకూడా ఏకీభవించాలి.
** రవి-చంద్ర స్పుటభాగలిప్తలతో సమానంగా రాహు లేక కేతు గ్రహస్పుట భాగలిప్తలు సమానంగా యున్నప్పుడు మాత్రమే అమవాస్య అంత్యకాలము,గ్రహణ మద్యకాలము ఓకటిగా ఏకీభవించును.
** ఎవరి అయనాంశరీత్యా గణించిన పంచాంగమైన దాని రీతి మన గ్రామము లేదా పట్టణముమీద నడినెత్తిన సూర్యుడు మిట్టమద్యాహ్ననకాలమున ఏ తేది నాడు ప్రాప్తించునది సాధించి
ప్రత్యక్షంగా చూచినచో ఎవరి అయనాంశలరీత్యా తయారుచెయబడిన పంచాంగములు సరియైనదని తెలుసుకొనవచ్చును.
** ఈ ప్రయోగము తో N.C.Lahari గారి అయనాంశమాత్రమే సరియైనదనిఋజువయినది.
దృక్ సిద్దాంతమైన, పూర్వసిద్దాంతమైన గ్రహణాలే ప్రత్యక్షనిదర్శనాలు.నిష్ణాతులైనవారు వారి వారి సిద్దాంత గణకములతో ఏకాభిప్రాయమునకు రాగలరు.అవగాహన లేని వారి
సిద్దాంత రాధాంతాలతో ఆధునికులగా-సాంప్రదాయ వాదులుగా విభేదిస్తూ పంచాంగరచనను భ్రష్టు పట్టిస్తున్నారు.వీటి కొరకు అవగాహన సదస్సులు అప్పుడప్పుడు జరుగుతుండాలని నా మనవి.
దృక్సిద్దాంతం అనే మాటను వినగానే అవగాహన లేని సాంప్రదాయవదులు ఆధిపత్యపోరుకై అర్చేస్తున్నారు.సాంప్రదాయవాదులను మూర్ఖులుగా అభివర్ణిస్తున్నారు దృక్సిద్దాంతులు.ఇది నేటి పరిస్థితి.