Friday, 16 September 2016

SIDHANTAM-RADHANTAM.

                                  "ధృక్ సిద్దాంతం & పూర్వసిద్దాంతం"


మన  పంచాంగములు  సౌరమాన-చామంద్రమాన  సిద్దాంతల  మేలికలియకతొ కూర్చబడి  హిందు సాంప్రదాయ జీవన విదానానికి అనుగుణంగ  ఎన్నోవిధములుగ   ఉపకరిస్తున్నది.
ఏ  ఒక్క సిధాంతంపైనే  మనపంచాంగం నిర్మించబడదు,మనకు ఉపయోగపడదు.ధృక్ (సాయన,పాశ్చత్యులపద్దతి)
-ఫూర్వ సిద్ధాంతం (నిరయణ,మన సాంప్రదాయ సిధాంతం)  సౌరమాన-చాంద్రమన  పద్దతులు,ఈ రెండిటిని వేరుచేయలేము.

                                   "చిత్ర పక్ష అయనాంశ"


సాయన పద్దతిలొ  అయనాంశకు  ఎంతప్రాధాన్యత ఉందో, నిరయణ సిద్దాంతలో  కుడా  అయనాంశకు  అంతే ప్రాధాన్యత ,కాని నేడు ఎన్నో అయనాంశలు  ఆచరణలొ ఉన్నాయి. 
ఏది  సత్యమో  నిరూపించేది  గ్రహాణాలే  ప్రత్యక్ష నిదర్శనాలు. గ్రహణాద్యయములో  గ్రహణ మద్యకాలము  తిథి అంత్యకాలము  ఇంచుమించుగా సరిపొవాలనే  సూత్రంమున్నది. 
గ్రహణమందు  పౌర్ణమికి పట్టు - పాడ్యమికి విడుపు  అన్నారు  మన పెద్దలు. అమవాస్యకు సూర్యగ్రహణం - పౌర్ణమిలో చంద్రగ్రహణం ప్రాప్తించును.
సూర్యగ్రహణం తీక్షణంగా చుడలేము కావున, చంద్రగ్రహణం స్పష్టంగా చూడవచ్చును.కావున ఈ వాక్యమును చెప్పిఉండవచ్చు.

**పౌర్ణమి పట్టు అనగా గ్రహణ ప్రారంభ కాలము నుండి గ్రహణమద్యకాలము వరకు అని అర్థం.
  దీనిని బట్టి గ్రహణ మద్యకాలము  పౌర్ణమితిథి అంత్యము ఒకటే అని అర్థమగుచున్నది.


**పాడ్యమి విడుపు అనగా గ్రహణ మద్యకాలము నుండి గ్రహణ అంత్యకాలము వరకు అని అర్థం
  సూర్య గ్రహణ  ఆద్యంత పట్టు-విడుపు మొత్తము కాలములో  అమావస్య-పాడ్యమి తిథులు అర్థభాగంగ వుంటాయి.

**చంద్రగ్రహణం ఆద్యంత పట్టు-విడుపు మొత్తము కాలములో అర్ధబాగలుగ పౌర్ణమి-పాడ్యమి తిథులు ఉంటాయి.

ఈ సూత్రమునకు పత్యక్షంగా సరిపోయేది N.C.LAHARI.ప్రతిపాదించిన   చిత్ర పక్ష అయనాంశ    మాత్రమె దృక్ కు   వచ్చుచున్నది. 
కావున  ఈ   సిధ్దాంతమును  దృక్ సిద్ధాంతము  అని వ్యవహరింతురు.



*** ఉభయ సాయన-నిరయణ పద్దతులలో ఎ పద్దతి ద్వారా  తిద్ద్యాంతాన్ని సాధించినను  శుద్ద పాడ్యమి  మొదలు  బహుళ అమావాస్యాంత కాలములు  ఒకటిగానే వచ్చితీరును. వచ్చితిరాలి.
ఈ కారాణలవల్లే పాశ్చాత్యుల సాయన పంచాంగ రీత్యా సాధించిన తిధ్యాంతకాలాని కే సమానంగా
**1.N.C.LAHARI, 
**2.B.V.RAMAN,
**3.K.P. గార్ల అయనాంశలరీత్యా సాధించిన తిద్ద్యాంతాలు సమానంగా ప్రాప్తించు చున్నవి.


**  సంపూర్ణ చంద్రగ్రహణ మద్యకాలము ఎవరి అయనాంశములను తీసుకొని సాధించినా ప్రాప్తించు పౌర్ణమి తిధ్యాంత కాలమునకు సమానముగా కాని, 
      సమీపముగకాని యుండునో వారు సాధించిన అయనాంశముల రీత్యా గణింపబడిన పంచాంగమే దృక్సిద్దాంతమైనదని ఋజువగుచున్నది.

 **  అలాగే అమవాస్యనాడు సూర్యగ్రహణ మధ్యకాలముతొ అమావాస్య అంత్యకాలాలుకూడా ఏకీభవించాలి.

 **  రవి-చంద్ర స్పుటభాగలిప్తలతో సమానంగా రాహు లేక  కేతు గ్రహస్పుట భాగలిప్తలు సమానంగా యున్నప్పుడు మాత్రమే అమవాస్య అంత్యకాలము,గ్రహణ మద్యకాలము ఓకటిగా ఏకీభవించును.

 **  ఎవరి అయనాంశరీత్యా గణించిన పంచాంగమైన దాని  రీతి మన గ్రామము లేదా పట్టణముమీద నడినెత్తిన సూర్యుడు మిట్టమద్యాహ్ననకాలమున ఏ తేది నాడు ప్రాప్తించునది సాధించి 

 ప్రత్యక్షంగా చూచినచో ఎవరి అయనాంశలరీత్యా తయారుచెయబడిన పంచాంగములు సరియైనదని తెలుసుకొనవచ్చును.

 ** ఈ ప్రయోగము తో   N.C.Lahari గారి అయనాంశమాత్రమే సరియైనదనిఋజువయినది.

 దృక్ సిద్దాంతమైన, పూర్వసిద్దాంతమైన గ్రహణాలే ప్రత్యక్షనిదర్శనాలు.నిష్ణాతులైనవారు వారి వారి సిద్దాంత గణకములతో ఏకాభిప్రాయమునకు రాగలరు.అవగాహన లేని వారి
సిద్దాంత రాధాంతాలతో ఆధునికులగా-సాంప్రదాయ వాదులుగా విభేదిస్తూ పంచాంగరచనను భ్రష్టు పట్టిస్తున్నారు.వీటి కొరకు అవగాహన సదస్సులు అప్పుడప్పుడు జరుగుతుండాలని నా మనవి.
దృక్సిద్దాంతం అనే మాటను వినగానే అవగాహన లేని సాంప్రదాయవదులు ఆధిపత్యపోరుకై అర్చేస్తున్నారు.సాంప్రదాయవాదులను మూర్ఖులుగా అభివర్ణిస్తున్నారు దృక్సిద్దాంతులు.ఇది నేటి పరిస్థితి.





Tuesday, 12 July 2016

అది ఆయన ప్రత్యేకత

హాస్యబ్రహ్మ శ్రీ శంకరనారాయణ గారు ఎంత హాస్య ప్రియులో...అంతగంభీరంగావుంటారు.కొద్దికాలంలోనే మా మద్య మంచి స్నేహం ఏర్పడింది.ఆయన మట్లాడిన ప్రతి మాటలొ హాస్యంతొ పాటు విజ్నానం వుంటుంది.వేదికపై కూర్చొని చలోక్తులు విసురుతూ సభికులవైపు చూసే చూపు బాగ నవ్వుపుట్టిస్తుంది.అది ఆయన ప్రత్యేకత.


Monday, 11 July 2016

                                          వనప్రతిష్టాపనా మహోత్సవం



 శ్లొ//అశ్వథ మేకం పిచుమంద మేకం న్యగ్రోధమేకం దశతింత్రీణీకం/

   కపిత్థ బిల్వామలక త్రయంచ నవామ్రవాపి నరకం నయాతి//


అశ్వత్థ--రావి
పిచుమంద--వేప (1)
న్యగ్రోధ--మ ఱ్రి(1)
తింత్రిణీ--చింతచెట్లు (10)
కపిథం--వెలుగ(3)
బిల్వం--మారేడు(3)
ఆమలకం--ఉసిరి(3)
ఆమ్ర--మామిడి(9)
ఈ విధముగా చెట్లు నాటి పోషీంచి పెద్దచేసితే నరకం "నరకం నయాతి" అతనికి నరకం ఉండదు అని మన సనాతన సాంప్రదాయల విశ్వాసం

"వాపీ కూప తటకాని వాజపేయ శతానిచ, గజదాన  సహస్రాణి ఆరామన్యశతాంశకం"

బావులు త్రవ్వడం,చెరువులు వేయించడం,వాజపేయంలాంటి మహాక్రతువులు నిర్వహించడం,వెయ్యి ఏనుగులు  దానంచేసినదానికన్న  వనములు పెంచడం,చెట్లు నాటి పోషించడంవల్ల  వెయ్యంతల ఫలితం.

         

   
       
     సామాన్యుడు                                             ప్రభువు / అధికారులు                                                       రాజులు / ప్రజాప్రతినిధులు
 
 
అశ్వత్థ--రావి (1)                                    (100)                                                                   (1000)
పిచుమంద--వేప (1)                              (100)                                                                   (1000)
న్యగ్రోధ--మ ఱ్రి(1)                                  (100)                                                                    (1000)


తింత్రిణీ--చింతచెట్లు (10)                     (1000)                                                                    (10,000)
కపిథం--వెలుగ(3)                               (300)                                                                     (3000)
బిల్వం--మారేడు(3)                             (300)                                                                     (3000)

ఆమలకం--ఉసిరి(3)                         (300)                                                                         (3000)

ఆమ్ర--మామిడి(9)                           (900)                                                                        (9000)

ప్రజాప్రతినిధులయిన,  గ్రామాదీశులు,  మండాలాధీశులు,   య.యల్.ఎ,   యంపీ ,    సర్వేసర్వత్ర  పై  సూచించిన సంఖ్యలో చెట్లు నాటి పోషించితే  దేశంలొ ఫలవంతమైన వృక్షసంపద  పెరిగి మహారణ్యములు ఏర్పడి అడుగడుగున నైమిశారణ్యములు ఏర్పడును.










                 
             

                              వనముల ప్రత్యేకత
శ్లో// పురా పుణ్యైకమతయహ్  పుణ్యక్షేత్రే  చతుష్పధే/
     జంత్వా తపన శాంత్యర్థం సుఖార్థంతు తపస్వినాం/
    పక్షిణాం సుఖవాసార్థం తపనార్థం మునీశ్వరా/
చక్రుర్వరాని స్రర్వత్ర పుణ్యేభారతవర్షకే//

పూర్వమందు  కొందఱు  పుణాత్ములు  జంతువులకు  ఎండవలన  కలిగెడు తాపము   పోవుట కొరుకును, మునీశ్వరులకు  సుఖము     కలలుగుకొఱుకును, పక్షులు   సుఖించు    కొ ఱకును   జీవుంచుటకును  ఫుణ్యక్షేత్రములయందును     నాలుగుమార్గములు    కూడిన ప్రదేశములయందును మఱియు    భరతఖండములో   ఫుణ్యప్రదేశము ఎచ్చట ఎచ్చట వుండునో అట్టి సమస్త ప్రదేశములయందును వనముల నేర్పరచిరి.

పర్యావరణ పరిరక్షణ, వాతావరణకాలుష్యం భూజలపరిరక్షణ,బాగుగ వర్షములుకురుయు కుఱుయుటకు మన పూర్వులు చేసినదానికన్న ఎక్కువగా చేయవలసియున్నది.


 (బ్రా)      శ్లొ/కదంభాశ్వథ పలాశ ఖదిరాశ్చ వైకంకతః/
              బ్రా  హ్మణానాం ప్రశస్తాస్స్యుః వృక్షాబల సుఖప్రదాః//
తా// కడిమి, రావి, మోదుగ, చండ్రపుల్ల (పుల్లవెలుగ),వెలుగ యి చెట్లు ప్రశస్తమయినివగను బలమును సుఖమును నిచ్చునవిగను చెప్పబడినవ


          శ్లో// న్యగ్ర్యోధ భిల్వ ఖదిరాః  క్షత్రియస్య సుఖప్రదాః/ (క్ష)
                మధూకౌదుంబరాశ్చైవ ఖదిరాశ్చార్హ్జున స్తరుః /.(వై)
                  వైశ్యస్యశుభదా, ప్రోక్తాః యశోబలసుఖప్రదాః//
తా//        మఱ్రి,     మారేడు,చండ్ర  యీ వృక్షములు రాజులకు ఉత్తమమైనవి.   తా//ఇప్ప,మేడి మద్ది యీ వృక్షములు వైశ్యులకు, శుభములునొసంగు                ననియు కీర్తీనిచ్చుననియు,సుఖము నిచ్చుననవిగను జెప్పబడినవి.  

      శ్లో//     ఔదుంబర శ్శమీచైవ ఖదిర శూద్రసమ్మతం
        //తా// మేడి,జమ్మి,చండ్ర యీ చెట్లు ఎవ్వరైన పెట్టవచ్చును.
                              వనముల  

ప్రత్యేకత
శ్లో// పురా పుణ్యైకమతయహ్  పుణ్యక్షేత్రే  చతుష్పధే/
     జంత్వా తపన శాంత్యర్థం సుఖార్థంతు తపస్వినాం/
    పక్షిణాం సుఖవాసార్థం తపనార్థం మునీశ్వరా/
చక్రుర్వరాని స్రర్వత్ర పుణ్యేభారతవర్షకే//

పూర్వమందు  కొందఱు  పుణాత్ములు  జంతువులకు  ఎండవలన  కలిగెడు తాపము   పోవుట కొరుకును, మునీశ్వరులకు  సుఖము     కలలుగుకొఱుకును, పక్షులు   సుఖించు    కొ ఱకును   జీవుంచుటకును  ఫుణ్యక్షేత్రములయందును     నాలుగుమార్గములు    కూడిన ప్రదేశములయందును మఱియు    భరతఖండములో   ఫుణ్యప్రదేశము ఎచ్చట ఎచ్చట వుండునో అట్టి సమస్త ప్రదేశములయందును వనముల నేర్పరచిరి.

పర్యావరణ పరిరక్షణ, వాతావరణకాలుష్యం భూజలపరిరక్షణ,బాగుగ వర్షములుకురుయు కుఱుయుటకు మన పూర్వులు చేసినదానికన్న ఎక్కువగా చేయవలసియున్నది.


 (బ్రా)      శ్లొ/కదంభాశ్వథ పలాశ ఖదిరాశ్చ వైకంకతః/
              బ్రా  హ్మణానాం ప్రశస్తాస్స్యుః వృక్షాబల సుఖప్రదాః//
తా// కడిమి, రావి, మోదుగ, చండ్రపుల్ల (పుల్లవెలుగ),వెలుగ యి చెట్లు ప్రశస్తమయినివగను బలమును సుఖమును నిచ్చునవిగను చెప్పబడినవ


          శ్లో// న్యగ్ర్యోధ భిల్వ ఖదిరాః  క్షత్రియస్య సుఖప్రదాః/ (క్ష)
                మధూకౌదుంబరాశ్చైవ ఖదిరాశ్చార్హ్జున స్తరుః /.(వై)
                  వైశ్యస్యశుభదా, ప్రోక్తాః యశోబలసుఖప్రదాః//
తా//        మఱ్రి,     మారేడు,చండ్ర  యీ వృక్షములు రాజులకు ఉత్తమమైనవి.   తా//ఇప్ప,మేడి మద్ది యీ వృక్షములు వైశ్యులకు, శుభములునొసంగు                ననియు కీర్తీనిచ్చుననియు,సుఖము నిచ్చుననవిగను జెప్పబడినవి.  

      శ్లో//     ఔదుంబర శ్శమీచైవ ఖదిర శూద్రసమ్మతం
        //తా// మేడి,జమ్మి,చండ్ర యీ చెట్లు ఎవ్వరైన పెట్టవచ్చును.